Telangana Anganwadi Jobs 15982: Telangana Anganwadi అంగన్‌వాడీల్లో కొలువుల జాతర
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. భారీ సంఖ్యలో 15,982 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా ఖాళీలు గుర్తించిన శిశు సంక్షేమశాఖ..భర్తీకి నోటిఫికేషన్లు జారీచేస్తోంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో టీచర్ పోస్టులు, మహబూబ్‌నగర్‌లోని 4 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో టీచర్లు, సహాయకులు కలిపి 177 పోస్టులకు ఆయా జిల్లా కలెక్టర్లు ఉద్యోగ ప్రకటనలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో ఇదే తరహాలో వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీకానున్నాయి.
- నియామక ప్రక్రియ ప్రారంభం
- 33 జిల్లాల్లో 15,982 ఖాళీలు
- టీచర్లు 3,100, సహాయకులు 12,882
- జిల్లాల వారీగా నోటిఫికేషన్ల జారీకి మార్గదర్శకాలు
Telangana Anganwadi Jobs 15982 Details:
| Sl. No | District | Teacher | Helper |
| 1 | Asifabad | 182 | 452 |
| 2 | Mancherial | 110 | 398 |
| 3 | Peddapalli | 56 | 252 |
| 4 | Bhupalapalli | 50 | 133 |
| 5 | Mulugu | 95 | 319 |
| 6 | Adilabada | 176 | 628 |
| 7 | Nirmal | 80 | 435 |
| 8 | Nizamabad | 80 | 601 |
| 9 | Jagtial | 70 | 352 |
| 10 | Karimnagar | 56 | 230 |
| 11 | Siricilla | 57 | 181 |
| 12 | Siddipet | 84 | 271 |
| 13 | Medak | 63 | 345 |
| 14 | Kamareddy | 106 | 445 |
| 15 | Kothagudem | 192 | 1033 |
| 16 | Khammam | 136 | 655 |
| 17 | Mahabubabad | 116 | 478 |
| 18 | Warangal | 63 | 289 |
| 19 | Hanmakonda | 71 | 240 |
| 20 | Suryapet | 84 | 321 |
| 21 | Nalgonda | 148 | 688 |
| 22 | Yadadri Bhuvanagiri | 62 | 270 |
| 23 | Janagama | 27 | 187 |
| 24 | Medchal | 64 | 227 |
| 25 | Hyderabad | 183 | 402 |
| 26 | Rangareddy | 137 | 611 |
| 27 | Sangareddy | 80 | 416 |
| 28 | Vikarabad | 94 | 399 |
| 29 | Mahabubnagar | 62 | 364 |
| 30 | Narayanapet | 32 | 196 |
| 31 | Gadwal | 65 | 308 |
| 32 | Wanaparthy | 47 | 203 |
| 33 | Nagarkurnool | 162 | 553 |
| Total | 3090 | 12882 |
కొత్తగా ఇంటర్వ్యూ విధానం..
అంగన్‌వాడీ నిబంధనల ప్రకారం..అంగన్‌వాడీ టీచర్, సహాయకుల పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్ విద్యార్హతను రాష్ట్ర ప్రభుత్వం ఈసారి తప్పనిసరి చేసింది. అలాగే పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. తాజాగా ఎంపిక విధానంలో ఇంటర్వ్యూకు అనుమతిస్తూ జీవో నం.4, మార్కుల వెయిటేజీ ఖరారు చేస్తూ జీవో నం.6 జారీ చేసింది. ఆ ప్రకారం.. మల్టీజోన్-1 పరిధిలోని మొత్తం 20,584 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1,853 టీచర్లు, 7,737 సహాయకుల పోస్టులు కలిపి మొత్తం 9,590 ఖాళీలు ఉన్నాయి. మల్టీజోన్-2 పరిధిలో 15,197 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1247 టీచర్లు, 5145 సహాయకులు కలిపి 6,392 ఖాళీలు ఉన్నాయి.
సుదీర్ఘ అధ్యయనం అనంతరం
- వాస్తవంగా పోస్టులు భర్తీ చేయాలని ఏడాదిన్నర క్రితమే సర్కారు నిర్ణయించింది. నియామక విధానం, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న సర్వీసు నిబంధనలు, తదితర అంశాలపై అధ్యయనం చేసి.. నియామక విధానాన్ని ఇటీవల ఖరారుచేసింది.
- అంగన్‌వాడీ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పట్టణాలు లేదా గ్రామాల్లోని సంబంధిత వార్డులో స్థానికులై ఉండాలి.
- గిరిజన, ఆదివాసీ తండాలు, గూడేలు, ఆవాసాల్లో పోస్టులకు సంబంధిత ఆవాస ఎస్టీ మహిళలు అర్హులు. ఎస్సీ వాడల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలు అర్హులు.
- అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)..అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించింది.
- టీచర్ల, సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. సహాయకుల పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేనిపక్షంలో..తదుపరి పదోతరగతి పాసైన వారిని పరిగణనలోకి తీసుకోవాలని ఎంపిక నిబంధనల్లో పేర్కొంది.
- ఎంపికలో మార్కులకు వెయిటేజీ ఉంటుంది. ఇంటర్‌లో వచ్చిన మార్కులకు 70 శాతం, వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూలకు పది మార్కులు ఉంటాయి.










